: శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి బుల్లెట్ స్వాధీనం


శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ ఉండటం కలకలం రేపింది. విమానాశ్రయ భద్రతా అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళుతున్న ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా ఎయిర్ పోర్టులో కనిపించాడు. దాంతో అధికారులు అతడిని, లగేజీని తనిఖీ చేయగా ఎకె 47 గన్ లో ఓ బుల్లెట్ కనిపించింది. వెంటనే దాన్ని తీసేసుకున్నారు. అతడిని ఆర్మీ జవాన్ కిషన్ నాయక్ గా గుర్తించారు. తరువాత పోలీసులకు అప్పగించగా... దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం అతడిని పోలీసులు విచారణ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News