: సుబ్రమణ్యస్వామికి ఏదో ఒకరోజు తగిన శాస్తి జరుగుతుంది: వీహెచ్
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి చేసిన ఆరోపణలపై రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మండిపడుతున్నారు. తాను మేధావినంటూ వ్యవహరిస్తున్న స్వామికి ఏదో ఒకరోజు తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించారు. ఆయనో బ్లాక్ మెయిలర్, శాడిస్ట్ అని తిట్టి పోశారు. ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో దిక్కుతోచని బీజేపీ నేతలు రాహుల్ కు బ్రిటీష్ పౌరసత్వం ఉందని, కమీషన్ ఏజెంట్ అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు దాడి చేస్తాయనే స్వామి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అటు మోదీ, ఆర్ఎస్ఎస్ మెప్పుల కోసమే అభాండాలు వేస్తున్నారన్నారు. తనపై విచారణ చేసుకోవాలన్న రాహుల్ సవాల్ ను మోదీ స్వీకరించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.