: ఛోటా రాజన్ తరలింపుతో తీహార్ జైల్లో భద్రత పెంపు


మాఫియా డాన్ ఛోటా రాజన్ ను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జైలు పరిసరాల్లో మరింత భద్రత పెంచారు. రాజన్ ను ఉంచిన 'జైలు 2' పరిసరాల్లో అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి అంగుళం కవరయ్యే విధంగా కెమెరాలు పెట్టారు. ఈ నేపథ్యంలో 10 మంది హెడ్ వార్డర్స్, ఒక డిప్యూటీ సూపరింటెండెంట్, ఇద్దరు అసిస్టెంట్ సూపరింటెండెంట్స్ తో భద్రత ఏర్పాటు చేసినట్టు జైలు డీజీ తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి భద్రత ఉల్లంఘన జరిగినా సహించబోమని సిబ్బందిని హెచ్చరించినట్టు చెప్పారు. అంతేగాక జైలు బయట ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించినట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News