: చదువు పూర్తి కాకుండానే గూగుల్ లో రూ. 1.27 కోట్ల ఆఫర్ కొట్టేసిన టెక్కీ!
ఇంకా చదువు కూడా పూర్తికాని ఆ యువ టెక్కీ మేధస్సుకు గూగుల్ అచ్చెరువొందింది. ఏకంగా కాలిఫోర్నియాలోని తమ కార్యాలయంలో పని చేయాలంటూ సంవత్సరానికి రూ. 1.27 కోట్ల భారీ ఆఫర్ ను ఇచ్చింది. ఢిల్లీ టెక్నాలజీ యూనివర్శిటీలో ఇన్పర్మేషన్ టెక్నాలజీ విభాగంలో ఫైనలియర్ చదువుతున్న చేతన్ కక్కర్ ను గూగుల్ ఆహ్వానించింది. కోర్సును పూర్తి చేశాక వచ్చే సంవత్సరంలో కాలిఫోర్నియాకు రావాలని గూగుల్ కోరగా, అందుకు చేతన్ అంగీకరించాడు. ఢిల్లీ వర్శిటీ నుంచి ఇంత భారీ ఆఫర్ అందుకున్న తొలి విద్యార్థి చేతన్. తాను గూగుల్ లో చేరేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు చేతన్ చెబుతున్నాడు.