: ఏపీకి వస్తున్న ‘అల్-అఫ్రాజ్’... ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు సంసిద్ధత


ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే జపాన్, సింగపూర్ దేశాలకు చెందిన పలు సంస్థలతో పాటు దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు కూడా ఏపీకి ఇప్పటికే భారీ పెట్టుబడులను ప్రకటించాయి. తాజాగా కువైట్ కు చెందిన అల్-అఫ్రాజ్ హోల్డింగ్స్ కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఈ మేరకు నిన్న ఏపీ పర్యటనకు వచ్చిన కంపెనీ అధినేత అఫ్రాజ్ నేటి ఉదయం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు అవకాశం ఉన్న అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. ఏపీలో ఆయిల్ రిఫైనరీని ఏర్పాటు చేయాలన్న చంద్రబాబు ప్రతిపాదనకు అఫ్రాజ్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే దీనిపై సమగ్ర ప్రణాళికతో ముందుకు వస్తామని అఫ్రాజ్ చెప్పారు.

  • Loading...

More Telugu News