: మా యుద్ధం ఇక అప్పుడే ముగుస్తుంది!: ఐఎస్ఐఎస్ తాజా ప్రకటన


ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరో హెచ్చరికల వీడియోను విడుదల చేశారు. "పారిస్ బిఫోర్ రోమ్" అంటూ టైటిల్ పెట్టిన ఈ ఆరు నిమిషాల నిడివి ఉన్న వీడియోలో "మీతో మొదలు పెట్టాం. మా యుద్ధం వైట్ హౌస్ గా పిలుచుకునే భవనంతో ముగిస్తాం" అంటూ ఓ ఫైటర్ వెల్లడించడం కనిపిస్తోంది. "మేము దాన్ని పేల్చేస్తాం. ఎలాగైతే ఇతర భవనాలను పేలుస్తున్నామో అలాగే... మా సూసైడ్ బెల్టులు, కారు బాంబులు సిద్ధంగా ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్లినా మేము రాగలం" అంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలను ఉద్దేశించి హెచ్చరించారు. కాగా, పారిస్ తరహా దాడులకు అమెరికాలో అవకాశం ఉందని భావించడం లేదని, వారికి ఒక లక్ష్యం అంటూ ఏమీ లేదని ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వారు కేవలం ప్రచారం కోసమే ఈ తరహా వీడియోలు విడుదల చేస్తున్నారని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News