: యూరప్ తొలి మహిళా సూసైడ్ బాంబర్ జీవితంలోకి చూస్తే..!


హస్నా అయిత్ బౌలాచన్... యూరప్ లో తొలి మహిళా సూసైడ్ బాంబర్. రెండు రోజుల క్రితం పారిస్ భద్రతా దళాలు చుట్టుముట్టిన వేళ, తనను తాను పేల్చుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాది. ఆమె తన జీవితంలో ఎంతో విలాసవంతంగా ఉండేందుకు ఇష్టపడేదని తెలుస్తోంది. స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లున్న బౌలాచన్ కు పార్టీలంటే పిచ్చి. ఆమెకు ఎంతో మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, నిత్యమూ వారితో నైట్ పార్టీలకు తిరిగేదని ఇరుగు పొరుగు వారు, స్నేహితులు వెల్లడించారు. ఇక ఆమె సోదరుడు యూసఫ్ అయితే, తను ఖురాన్ చదవడాన్ని ఒక్కసారి కూడా గమనించలేదని తెలిపాడు. బౌలాచన్ కు 'కౌగర్ల్' అన్న నిక్ నేమ్ ఉండేదని తెలుస్తోంది. ఆమెకు సెల్ఫీల పిచ్చి కూడా. ఆఖరికి బాత్ రూములోని స్నానాల తొట్టిలోనూ ఫోటోలు దిగి నలుగురితో పంచుకుంది. ఆమె జీవిత విశేషాలకు సంబంధించిన 'బోల్డ్' వీడియో మీరూ చూడండి.

  • Loading...

More Telugu News