: దక్షిణాఫ్రికాలో బయటపడ్డ 1111 క్యారెట్ల అరుదైన డైమండ్


ఈ శతాబ్దంలోనే అతిపెద్ద, అరుదైన, విలువైన వజ్రం దక్షిణాఫ్రికా డైమండ్ మైన్స్ లో బయటపడింది. బొత్సావ్నా గనిలో 1111 క్యారెట్ల డైమండ్ లభించిందని ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల్లో ఇది రెండవదని లుకారా డైమండ్ కార్పొరేషన్ ప్రతినిధులు వెల్లడించారు. దీన్ని సానబట్టి, తుదిమెరుగులు దిద్దిన తరువాత ఎంత విలువ చేస్తుందన్నది నిర్ణయిస్తామని పేర్కొన్నారు. కాగా, 1905లో దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా వద్ద 3,106 క్యారెట్ల వజ్రం లభించగా, ప్రస్తుతం భువిపై ఉన్న వజ్రాల్లో అదే అతి పెద్దది. ఈ తాజా వజ్రం రెండవదిగా నిలుస్తుందని లుకారా విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.

  • Loading...

More Telugu News