: భారత్ చేరుకున్న యువీ, కీచ్...ముంబై ఎయిర్ పోర్టులో తళుక్కున మెరిసిన కొత్త జోడీ!


భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తన కాబోయే భార్య హాజెల్ కీచ్ తో నిన్న ముంబై ఎయిర్ పోర్టులో తళుక్కున మెరిశాడు. మూడు నెలలుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట ఇటీవల ఇండోనేసియా నగరం బాలికి వెళ్లింది. గుట్టుచప్పుడు కాకుండా మూడో కంటికి తెలియకుండా యువీ, కీచ్ లు ఎంగేజ్ మెంట్ చేసేసుకున్నారు. ఆ తర్వాత తమ ఎంగేజ్ మెంట్ ఫొటోను యువీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటున్నట్లు చూచాయగా ప్రకటించిన ఈ జంట కొద్దిరోజుల పాటు బాలిలోనే చక్కర్లు కొట్టి నిన్న భారత్ చేరుకుంది. ఈ సందర్భంగా ఈ జంట మీడియా కంటికి చిక్కేసింది.

  • Loading...

More Telugu News