: అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్... కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చిన అగ్రరాజ్యం


అగ్రరాజ్యం అమెరికా మరోమారు కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. చర్చల ద్వారానే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం సాధ్యమవుతుందని నిన్న ఆ దేశం అభిప్రాయపడింది. అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రషీల్ షరీఫ్, అగ్రరాజ్య విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ వద్ద కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన మరునాడే అమెరికా నోట కాశ్మీర్ ప్రస్తావన వినిపించడం గమనార్హం. ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా భారత్, పాక్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్న కాశ్మీర్ అంశంలో తాము జోక్యం చేసుకోలేమని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి జాన్ కిర్బీ ప్రకటించారు. అయితే ఇరు దేశాలు కూడా ఈ అంశంపై చర్చించి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులకు చెక్ పెట్టేలా ఇరు దేశాలు ఈ దిశగా అడుగు వేయాలని తాము కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News