: చింటూ రాయల్ లొంగిపోయాడా?... చిత్తూరులో జోరందుకున్న ఊహాగానాలు


చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ ల దారుణ హత్యకు సంబంధించి చిక్కుముడి వీడిపోయినట్టేనని తెలుస్తోంది. దాడి జరిగిన మరుక్షణమే ముగ్గురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కఠారి మోహన్ మేనల్లుడు చింటూ రాయల్ అలియాస్ చంద్రశేఖర్ కూడా పోలీసులకు లొంగిపోయాడని తెలుస్తోంది. చిత్తూరు జిల్లా గుడిపాల పోలీస్ స్టేషన్ లో అతడు లొంగిపోయినట్లు తొలుత వార్తలు వచ్చినా, పుత్తూరులోని పోలీస్ స్టేషన్ కు తన న్యాయవాదితో కలిసి వచ్చిన చింటూ పోలీసుల ఎదుట లొంగిపోయాడని విశ్వసనీయ సమాచారం. దీంతో రాయలసీమ రేంజ్ అదనపు డీజీ ఆర్పీ ఠాకూర్ హుటాహుటిన చిత్తూరు తరలివెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా కఠారి మోహన్ ను వెన్నంటి ఉన్న చింటూ రాయల్ అంతలోనే శత్రువుగా మారడానికి గల కారణాలేమిటన్న విషయంపై కూపీ లాగుతున్న పోలీసులు త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఇక తమ ఎదుట లొంగిపోయిన చింటూ రాయల్ ను రేపు మీడియా ఎదుట ప్రవేశపెట్టేందుకు పోలీసులు సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News