: బీహార్ సీఎంగా నితీశ్ పదవీ ప్రమాణం నేడే...పాట్నాకు క్యూ కట్టనున్న ప్రముఖులు
వరుస విజయాలతో జోరు మీదున్న బీజేపీకి బ్రేకులేసి సత్తా చాటిన జేడీయూ నేత నితీశ్ కుమార్ నేడు మూడో దఫా ఆ రాష్ట్ర సీఎంగా పదవీ ప్రమాణం చేయనున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో జట్టు కట్టి మహా కూటమి పేరిట బరిలోకి దిగిన నితీశ్, మొన్నటి ఎన్నికల్లో మూడింట రెండొంతుల సీట్లను కొల్లగొట్టేశారు. నేడు బీహార్ రాజధాని పాట్నాలో గాంధీ మైదాన్ లో నితీశ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాజీవ్ ప్రతాప్ రూఢీ, మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, సిద్దరామయ్య, అఖిలేశ్ యాదవ్, తరుణ్ గొగోయ్, ఇబోబి సింగ్, వీరభద్రసింగ్, పవన్ కుమార్ చామ్లింగ్ లతో పాటు పలు పార్టీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.