: చైనా మాంజాల అమ్మకాలపై నిషేధం విధించిన అలహాబాద్ హైకోర్టు


గాలిపటాలను ఎగుర వేసేందుకు ఉపయోగించే చైనా మాంజాల అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని అలహాబాద్ హైకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నైలాన్ దారంతో చేసిన మాంజాల కారణంగా అలహాబాద్ లోని పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో అనురాగ్ మిశ్రా అనే వ్యక్తి కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) వేశారు. దీనిపై స్పందించిన అలహాబాద్ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. చైనా మాంజాల కారణంగా కేవలం యూపీలోనే కాకుండా దేశంలోని పలు చోట్ల చాలామందికి గాయాలైన సంఘటనలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఒక సంఘటనలో ఒక బాలుడి ప్రాణం కూడా పోయింది. చెన్నయ్ లో మోటార్ సైకిల్ పై తన తండ్రిలో కలిసి వెళ్తున్న బాలుడి మెడను మాంజా కోసివేసిన సంఘటనలో అతను ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News