: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 16 శాతం వేతనం పెంచండి: ఏడవ పే కమిషన్ సిఫారసు


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 16 శాతం వేతనం పెంచాలని ఏడవ పే కమిషన్ సిఫారసు చేసింది. జస్టిస్ ఏకే మాథుర్ నేతృత్వంలోని ఏడవ పే కమిషన్ తమ నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ఈరోజు సమర్పించింది. పే కమిషన్ చేసిన సిఫార్సుల నివేదికను త్వరలో కేబినెట్ కి సమర్పిస్తారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత జనవరి 1, 2016 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. వేతనంలో పెంపు ద్వారా 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందుతారు. కాగా, 2008లో 6వ పే కమిషన్ చేసిన సిఫారసుల మేరకు 35 శాతం పెంచారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరింపు కోసం ‘కేంద్రం’ పే కమిషన్ ను ఏర్పాటు చేస్తుందన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News