: పోలీసు కాల్పుల్లోనే అబ్దెల్ హమీద్ మృతి చెండాడు: ప్రెంచ్ ప్రాసిక్యూటర్ వెల్లడి


పారిస్ లో ‘ఉగ్ర’ దాడుల సూత్రధారి అబ్దెల్ హమీద్ అబోదిని పోలీసులే మట్టుబెట్టారని పారిస్ కు చెందిన ప్రభుత్వ అధికారి తెలిపారు. సెయింట్ డెన్నిస్ లోని అపార్టుమెంట్లలో తలదాచుకున్న ఉగ్రవాదుల కోసం ఫ్రెంచ్ నేషనల్ పోలీసు మంగళవారం తెల్లవారుజామున జరిపిన దాడుల్లో అబ్దెల్ హమీద్ చనిపోయినట్లు ఆయన చెప్పారు. హవీుద్ శరీరంలోకి బుల్లెట్స్ దూసుకుపోవడంతో తూట్లు పడ్డాయన్నారు. ఫింగర్ ప్రింట్స్, స్కిన్ శాంపిల్స్ ఆధారం చేసుకుని హవీుద్ మృతి చెందిన విషయాన్ని ధ్రువీకరించామని ఆ ప్రకటనలో తెలిపారు. కాగా, ఉగ్రవాదులు పారిస్ లో నరమేధం సృష్టించి సరిగ్గా వారం రోజులవుతోంది. పారిస్ లోని పలుచోట్ల జరిగిన దాడుల్లో 129 మంది వరకు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఫ్రెంచ్ దళాలు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై విరుచుకుపడ్డాయి. నిన్న సుమారు ఏడుగంటల పాటు జరిగిన ఆపరేషన్ లో చాలామందిని మట్టుబెట్టిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News