: జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ఖరారు చేస్తూ ఉత్తర్వులు


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పునర్విభజనను ఖరారు చేస్తూ జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మహానగరంలో 150 వార్డులను ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. గత నెలలోనే వార్డులను విభజించగా దాని ముసాయిదాపై 635 ఫిర్యాదులు, 65 సలహాలను స్వీకరించారు. వాటిని పరిగణనలోకి తీసుకుని వార్డులు, సరిహద్దులను మార్పు చేశారు. మొత్తం 38 సలహాలు, ఫిర్యాదుల్ని పాక్షికంగా పరిగణనలోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News