: మతాంతర వివాహంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు


క్రైస్తవ మతానికి చెందిన ఓ వ్యక్తి, హిందూ మతానికి చెందిన ఓ అమ్మాయిని వివాహం చేసుకున్న విషయంలో మద్రాస్ హైకోర్ట్ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. పెళ్లి చేసుకున్న జంటలో ఏ ఒక్కరు మతం మారకున్నా ఆ పెళ్లి చట్టబద్ధం కాదని స్పష్టం చేసింది. వారిద్దరి పెళ్లిని వ్యతిరేకించిన అమ్మాయి తల్లిదండ్రులు హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఈ క్రమంలో జరిగిన విచారణ సందర్భంగా యువతిని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. వారి పెళ్లి ఎలా జరిగిందని మద్రాస్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. హిందూ సంప్రదాయం ప్రకారం గుడిలో తాము పెళ్లి చేసుకున్నామని ఆమె చెప్పింది. ఈ నేపథ్యంలో సదరు క్రిస్టియన్ వ్యక్తి హిందూ మతం స్వీకరించాలని కోర్టు పేర్కొంది. అంతేగాక ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా తమ మతం మార్చుకోకున్నా మరో మతాచారం ప్రకారం వారి పెళ్లి చెల్లదని స్పష్టం చేసింది. అలాకాకుండా ఎవరి మతాలు వారు కొనసాగించాలనుకుంటే 1954 నాటి ప్రత్యేక వివాహ చట్టం కింద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని సలహా ఇచ్చింది. అయితే తాను మేజర్ నని, పెళ్లి చేసుకున్న వ్యక్తితోనే కలసి ఉంటానని అమ్మాయి చెప్పగా, అయితే ఆమె స్వేచ్ఛగా ఎక్కడైనా ఉండే హక్కు ఉందని కోర్టు చెప్పింది. అనంతరం ఆమె తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది.

  • Loading...

More Telugu News