: దేవుడు అంత శాడిస్టా?: రామ్ గోపాల్ వర్మ ధర్మసందేహం!


దేవుడు అంత శాడిస్టా? అంటూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సందేహాన్ని వ్యక్తం చేశాడు. పారిస్ పై జరిగిన ఉగ్రదాడుల నాటి నుంచి దేవుడిపై వర్మ మండిపడుతున్నాడు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు దేశాలు ఇతర దేశాల సహాయ సహకారాలు తీసుకుంటున్నట్టే దేవుళ్లు కూడా ఇతర దేవుళ్ల సహాయ సహకారాలు తీసుకుంటారా? అని ప్రశ్నించాడు. ఒకవేళ దేవుడు అనే వాడు నిజంగా ఉండి ఉంటే, తన పేరు మీద జరుగుతున్న హింసను చూస్తూ శాడిస్టికల్లీ ఎంజాయ్ చేస్తుండే బదులు బయటకు వచ్చి ఎందుకు చెప్పడం లేదు? అని ప్రశ్నించాడు. జరుగుతున్న హింసను అడ్డుకునే శక్తి లేనప్పుడు దేవుడు అనిపించుకోవడంలో అర్థమేముంది? అని అడిగాడు. అమాయకులను చంపేసే టెర్రరిస్టుల పట్ల నిరసన వ్యక్తం చేయడానికి బదులుగా టెర్రరిస్టులకు ఆ అవకాశం కల్పించిన దేవుడికి నిరసన తెలపాలని ఆయన అభిప్రాయపడ్డాడు. ఒబామా, పుతిన్, ఇంకొంత మంది ముస్లిం నాయకులతో పోలిస్తే దేవుడు టెర్రరిస్టుల పక్షాన ఉన్నట్టే అనిపిస్తోందని రాంగోపాల్ వర్మ పేర్కొన్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పటికైనా దేవుడు బయటికి వచ్చి తనను తాను నిరూపించుకోవాల్సిన సమయం ఇదేనంటూ రాంగోపాల్ వర్మ దేవుడికి సలహా ఇచ్చాడు.

  • Loading...

More Telugu News