: నితీశ్ ప్రమాణ స్వీకారానికి వెళ్లడం లేదు: శత్రుఘ్నసిన్హా
బీహార్ కు కాబోయే సీఎం, తన స్నేహితుడు నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను వెళ్లడం లేదని బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా తెలిపారు. తన వ్యక్తిగత పనులవల్లే వెళ్లడం లేదని, ఈ విషయాన్ని నితీశ్ కు కూడా చెప్పానని అన్నారు. భార్య పూనమ్ సిన్హాతో కలసి ఆయన ఈరోజు ఒడిషాలోని పూరి జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. బీహార్ ఎన్నికల్లో తలెత్తిన చిన్న చిన్న సమస్యలు తొలగిపోయి, తమ పార్టీకి మంచి జరగాలని దేవుడిని కోరుకున్నట్టు తెలిపారు. కాగా, రేపు మధ్యాహ్నం 2 గంటలకు నితీశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.