: ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా జయసుధ, విజయశాంతి!


సినీ హీరోయిన్లు జయసుధ, విజయశాంతి వరంగల్ ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జయసుధ, మాజీ ఎంపీ విజయశాంతి లు వ్యక్తిగత కారణంగానే ఎన్నికల ప్రచారంలో పాల్గొన లేదని సమాచారం. వాళ్లిద్దరినీ ప్రచారంలో పాల్గొనమంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆహ్వానించినప్పటికీ వారు పట్టించుకోలేదు. కనీసం, చివరి రెండు రోజులైనా ప్రచారంలో పాల్గొనాలని నేతలు కోరినప్పటికీ ఫలితం లేదు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ ప్రత్యేకంగా వాళ్లిద్దరినీ ఆహ్వానించి మరీ ఈ విషయం చెప్పారు. వ్యక్తిగత కారణాల రీత్యా తాము ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేమంటూ వాళ్లిద్దరూ తిరస్కరించినట్లు సమాచారం. కాగా, జయసుధ, విజయశాంతి కొంత కాలంగా పార్టీకి దూరంగానే ఉంటున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

  • Loading...

More Telugu News