: అమానుషం... హెచ్ఐవీ పాజిటివ్ ఉందని స్కూలు నుంచి చిన్నారిని గెంటేశారు


హెచ్ఐవీ పాజిటివ్ ఉందనే కారణంగా ఓ చిన్నారిని స్కూలు నుంచి గెంటేశారు. ఈ అమానవీయ ఘటన పశ్చిమబెంగాల్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ పాఠశాల కోల్ కతాకు సమీపంలోనే ఉంది. ఒకటో తరగతి చదువుతున్న ఆ చిన్నారిని తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రకరకాల వ్యాఖ్యలతో బాధపెడుతున్నా పాఠశాల సిబ్బంది ఏ మాత్రం అడ్డుకోలేదు. పైగా, మళ్లీ స్కూలుకు రావద్దంటూ ఆ చిన్నారిని తరిమేశారు. వాస్తవానికి తనకు, తన కుమారుడికి వ్యాధి ఉన్న సంగతి స్కూలు యాజమాన్యానికి ఆ విద్యార్థి తల్లి ముందే తెలిపింది. అంతేకాదు, ఎయిడ్స్ పై అవగాహన కల్పించే సంస్థలో తాను పనిచేస్తున్నట్టు కూడా చెప్పింది. అప్పుడు అభ్యంతర పెట్టని స్కూలు యాజమాన్యం, ఆ తర్వాత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించింది. అయితే, ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేయడం వల్లే తాము ఈ నిర్ణయానికి వచ్చామని యాజమాన్యం చెబుతోంది. జరిగిన ఘటనపై విద్యార్థి తల్లి తీవ్ర అభ్యతరం తెలిపింది.

  • Loading...

More Telugu News