: చైన్ స్నాచర్లకు సాయం చేస్తున్న కానిస్టేబుల్ మోహన్ అరెస్ట్
హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న వారికి సాయం చేస్తున్నాడన్న ఆరోపణలతో నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మోహన్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు నలుగురు చైన్ స్నాచర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఫరూక్ అనే వ్యక్తి, ఇరానీ ముఠాకు చెందిన మరో ముగ్గురు ఉన్నారు. అరెస్టయిన వారి నుంచి కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. వారిపై గతంలో 46 చైన్ స్నాచింగ్ కేసులు నమోదైనట్టు పోలీసు అధికారులు తెలిపారు.