: సీబీఐ నుంచి తప్పించుకునేందుకే కేసీఆర్ రూటు మార్చారు: పాల్వాయి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీకాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వరకే టీఆర్ఎస్ పార్టీ సింగిల్ గా ఉంటుందని... ఆ తర్వాత ఎన్డీయేలో చేరుతుందని చెప్పారు. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరుపుతోందని... ఆ విచారణ నుంచి బయట పడేందుకు బీజేపీవైపు కేసీఆర్ మెగ్గు చూపుతున్నారని పాల్వాయి తెలిపారు. అంతేకాకుండా, తన కూతురు కవితకు కేంద్ర మంత్రి పదవిని సాధించేందుకు కూడా కేసీఆర్ మంతనాలు సాగిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పి, మాట తప్పిన వ్యక్తి కేసీఆర్ అంటూ మండిపడ్డారు.