: రాయగడ అడవుల్లో దొరికిన మృతదేహం షీనా బోరాదేనని నిర్ధారణ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసులో మరో ముందడుగుపడింది. ముంబై సరిహద్దులోని రాయగడ అడవుల్లో లభ్యమైన మృతదేహం షీనా బోరాదేనని నిర్ధారణ అయింది. ఈ మేరకు ఎయిమ్స్ డాక్టర్లు ఫోరెన్సిక్ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించారు. నివేదికను సీబీఐ అధికారులకు సమర్పించారు. ఆమెను గొంతు నులిమి చంపేశారని అందులో తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ సింగ్ లపై చార్జ్ షీట్ నమోదు చేయనున్నట్టు సీబీఐ అధికారులు చెప్పారు. దక్షిణ ముంబై మెట్రోపాలిటన్ కోర్టు పరిధిలో చార్జ్ షీట్ దాఖలు చేస్తామన్నారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలను అందులో పేర్కొంటామని సీబీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.