: ప్రత్యేక రాయలసీమ ఉద్యమంలో పాల్గొంటానన్న సి.రామచంద్రయ్య
ప్రత్యేక రాయలసీమ ఉద్యమంలో తాను కూడా పాల్గొంటున్నట్టు కాంగ్రెస్ సీనీయర్ నేత సి.రామచంద్రయ్య స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఈ నెల 21వ తేదీన తిరుపతిలో జరగనున్న సమావేశానికి తాను హాజరవుతున్నట్టు వెల్లడించారు. రాయలసీమ పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ఆయన మండిపడ్డారు. నీటి ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ. 3 వేల కోట్లను ఇస్తే... అందులో నుంచి రాయలసీమకు రూ. 250 కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. ఎయిమ్స్, వ్యవసాయ యూనివర్శిటీ వంటి వాటిని కూడా కోస్తాంధ్రకే తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి కోస్తా ప్రాంతంపై ఉన్న ప్రేమ రాయలసీమపై లేదని మండిపడ్డారు.