: మరో విదేశీ పర్యటనకు నరేంద్ర మోదీ రెడీ!


మరో విదేశీ పర్యటన నిమిత్తం భారత ప్రధాని శనివారం నాడు బయలుదేరనున్నారు. ఈ దఫా ఆయన ప్రయాణం మలేషియా, సింగపూర్ దేశాలకు. 13వ ఆసియాన్ - ఇండియా సదస్సులో, 10వ తూర్పు ఆసియా దేశాల సదస్సులో ఆయన పాల్గొననున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి అనిల్ వాధ్వా మీడియాకు తెలిపారు. 21న కౌలాలంపూర్ చేరుకునే ప్రధాని, ఆ దేశ నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్టు వివరించారు. ఈ రెండు సదస్సులూ మలేషియా ప్రధాని మహమ్మద్ నజీబ్ బిన్ తున్ హాజీ అబ్దుల్ రజాక్ అధ్యక్షతన జరగనున్నాయని, ఆసియాన్ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్) అధినేతలు, ప్రతినిధులు హాజరు కానున్నారని వివరించారు. భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే దిశగా ఇక్కడ చర్చలు జరగనున్నాయని తెలిపారు. సదస్సు అనంతరం, కౌలాలంపూర్ డిక్లరేషన్, ఈఏఎస్ డిక్లరేషన్, ఉగ్రవాదంపై ఈస్ట్ ఆసియా దేశాల స్టేట్ మెంట్, భద్రత, సమాచార సాంకేతికతపై స్టేట్ మెంట్లు విడుదలవుతాయని వాధ్వా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News