: ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలను నాడు వైఎస్ అడ్డుకుంటానంటే నేను వ్యతిరేకించా: కేకే


దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలను అడ్డుకోవడానికి ప్రయత్నించారని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు చెప్పారు. అయితే తాను దానిని వ్యతిరేకించానని వెల్లడించారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 'ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గోల్డెన్ జూబ్లీ' ఉత్సవాల బ్రోచర్ ను కేకే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెప్పింది రాయకుంటే మీడియాను తప్పుపట్టడం సరికాదన్నారు. తాను కూడా మీలో ఒక్కడినేని, ప్రెస్ క్లబ్ మొదటి ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశానని తెలిపారు. గతంలో అకాడమీలు లేవని, ప్రముఖులతో నెలకోసారైనా మీట్ ది ప్రెస్ లు నిర్వహించేవారమని కేకే గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News