: బండారు దత్తాత్రేయకు స్వల్ప అస్వస్థత!
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దత్తాత్రేయ ముక్కు నుంచి రక్తస్రావం కావడంతో ఆయన్ని వరంగల్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వరంగల్ లో జరుగుతున్న బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. అయితే, తనకు కొంత నలతగా ఉందని చెప్పిన ఆయన ఎన్నికల ప్రచార సభ జరుగుతుండగా మధ్యలోనే వెళ్లిపోయారు.