: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ లో జడేజాకు మంచి ర్యాంక్ !
టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా కెరీర్ లో బెస్ట్ టెస్ట్ ర్యాంక్ సాధించాడు. ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్ లో 13వ స్థానంలో నిలిచాడు. ఐసీసీ విడుదల చేసిన తాజా జాబితాలో జడేజా ఈ ర్యాంక్ సాధించాడు. అశ్విన్ 5వ ర్యాంకులో ఉన్నాడు. మురళీ విజయ్, పుజారా, కోహ్లి వరుసగా 12, 14, 17 ర్యాంకులకు పడిపోయారు. ధావన్ 33వ ర్యాంకులో నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ మళ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. కాగా, దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో జడేజా 8 వికెట్లు పడగొట్టాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసుకున్నాడు. వర్షం కారణంగా రద్దయిన రెండో టెస్టులో మొదటి రోజే 4 వికెట్లు నేలకూల్చిన విషయం తెలిసిందే.