: విశాఖలో సందడి చేసిన సినీనటి కాజల్
ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్ విశాఖపట్టణంలో సందడి చేసింది. గాజువాకలో ఏర్పాటు చేసిన ఒక షాపింగ్ మాల్ ను ఆమె ఈ రోజు ప్రారంభించింది. అనంతరం ఆమె తన అభిమానులతో కొద్దిసేపు ముచ్చటించింది. రోడ్ సేఫ్టీ పాటించాలని అభిమానులకు సూచించింది. ముఖ్యంగా నిబంధనలను ఉల్లఘించవద్దని ఆమె తన అభిమానులను కోరింది. తమ అభిమాన హీరోయిన్ ను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. కాగా, గ్లామరస్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న కాజల్ తెలుగులో పలువురు ప్రముఖ హీరోల సరసన నటించింది.