: వరంగల్ లోక్ సభ పరిధిలో ఓటు హక్కులేని నేతలు జిల్లా వదిలి వెళ్లాలి: భన్వర్ లాల్


వరంగల్ లోక్ సభ పరిధిలో రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుందని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ చెప్పారు. ఈ నేపథ్యంలో అప్పటికల్లా ఇక్కడ ఓటు హక్కులేని నేతలు జిల్లా విడిచి వెళ్లిపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానిక నేతలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, ఎవరైనా బల్క్ మెసేజ్ లు పంపినా, కోడ్ ఉల్లంఘించినా తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను భన్వర్ లాల్ కోరారు. ఈ ఎన్నిక నేపథ్యంలో ఇప్పటివరకు 9 ఫిర్యాదులు అందాయని, వివరణ ఇవ్వాలని సీఎస్ ను ఆదేశించినట్టు చెప్పారు. వరంగల్ జిల్లాలో ఇప్పటివరకూ రూ.1.79 కోట్ల నగదు, 4314 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు.

  • Loading...

More Telugu News