: పార్టీ నేత పేర్ని నానిని జైల్లో పరామర్శించిన బొత్స
కృష్ణాజిల్లా మచిలీపట్నం సబ్ జైలులో రిమాండ్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నానిని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బొత్స సత్యనారాయణ కలిసి పరామర్శించారు. నానిని కలసిన వారిలో పార్టీ నేతలు కొలుసు పార్థసారధి, రామచంద్రారెడ్డి, జోగి రమేష్, ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు ఉన్నారు. అంతకుముందు నానిని విడుదల చేయాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ అధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో బొత్స పాల్గొన్నారు. రైతుల తరపున పోరాడుతున్న తమ పార్టీ నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. ఇలాంటి అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరని, రైతుల కోసం చివరి వరకూ పోరాడతామని బొత్స తెలిపారు.