: 5,500 ‘ఐఎస్’ ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేశాం: హ్యాకర్ల గ్రూప్


ఇప్పటివరకు ఐఎస్ఐఎస్ కు సంబంధించిన, వారితో సంబంధాలున్న సుమారు 5,500 ట్విట్టర్ అకౌంట్లను తాము హ్యాక్ చేసినట్లు గుర్తుతెలియని ఒక హ్యాకర్ల గ్రూప్ ప్రకటించింది. పారిస్ లో నరమేధం సృష్టించిన ఐఎస్ఐఎస్ పై తమ సైబర్ పోరు ఆగదని ఆ హ్యాకర్ల గ్రూప్ ఒక ట్వీట్ లో హెచ్చరించింది. ఈ మేరకు ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఒక మాస్క్ ధరించాడు. ఫ్రెంచ్ భాషలో మాట్లాడాడు. పారిస్ దాడులకు పాల్పడిన వారిని శిక్షించకుండా వదిలే ప్రసక్తే లేదని ఆ వీడియోలో పేర్కొన్నాడు. కాగా, హ్యాకర్ల గ్రూపు ఈ తరహా చర్యలకు పాల్పడితే ఐఎస్ఐఎస్ సమాచారం కరవవుతుందని ఫ్రాన్స్ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ అధికారి ఓలివర్ హెచ్చరించారు. గత శుక్రవారం రాత్రి జరిగిన పారిస్ దాడుల్లో సుమారు 129 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News