: డిసెంబర్ 17 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 17 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నట్టు తెలిసింది. ఇక గుంటూరు- విజయవాడ మధ్య ప్రాంతాల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 45 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరపాలని ప్రభుత్వం తీర్మానించింది.