: వరంగల్ లో ఓడితే టీఆర్ఎస్ పాలన బాగాలేనట్టే: కడియం శ్రీహరి


వరంగల్ ఉప ఎన్నికలు టీఆర్ఎస్ పాలనపై రెఫరెండమేనని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆయన, వరంగల్ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతే, టీఆర్ఎస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని భావించవచ్చని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు ఎదుటి పార్టీల వారిని విమర్శించడం సాధారణమే అయినప్పటికీ, తన కులం ప్రస్తావన తీసుకురావడం బాధ కలిగిస్తోందని శ్రీహరి అన్నారు. తాను మాదిగ కులంలో ఉపకులంగా ఉన్న బైండ్ల కులానికి చెందినవాడినని చెప్పారు. ప్రస్తుత ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గితే మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థి మెజారిటీ తగ్గుతుందని ఆయన వివరించారు. మాదిగల వర్గీకరణపై మంద కృష్ణ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడని, ఆయన ఎటువంటివాడో మాదిగలందరికీ తెలుసునని విమర్శించారు. వర్గీకరణపై త్వరలోనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లనున్నామని చెప్పిన ఆయన, మంత్రివర్గంలో మార్పులు చేర్పులు కేసీఆర్ ఇష్టమని అన్నారు.

  • Loading...

More Telugu News