: కేసీఆర్... ఏనాడైనా రైతుల పొలానికి వెళ్లారా?: ప్రత్యక్ష విమర్శలకు దిగిన జగన్


వరంగల్ ఉప ఎన్నికల పోరుకు నేటితో ప్రచారం ముగియనున్న వేళ, వైకాపా అధినేత ప్రత్యక్షంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలకు దిగారు. ఈ ఉదయం వరంగల్ జిల్లా గీసుకొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన, ఏనాడైనా రైతుల పొలంలో పరిస్థితి ఎలా వుందో తెలుసుకునేందుకు కేసీఆర్ వెళ్లారా? అని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ హయాంలో 20.60 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని, కేసీఆర్ ఎంత భూమిని పంచారన్న విషయాన్ని ప్రజలు అడగాలని సూచించారు. తెలంగాణలో పత్తి రైతుకు మద్దతు ధర దక్కడం లేదని, నిత్యావసరాల ధరలు మాత్రం పెరిగాయని ఆయన అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పత్తి రైతుకు క్వింటాలుకు రూ. 6,700 దక్కితే, నేడు కేవలం రూ. 4,100 మాత్రమే వస్తోందని, అధికారంలో ఉన్న ప్రభుత్వాల నిర్వాకం కారణంగానే రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వరంగల్ ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

  • Loading...

More Telugu News