: గంగిరెడ్డిని పట్టుకున్న పోలీసులకు ఏపీ ప్రభుత్వ అవార్డులు


మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని పట్టుకోవడంలో కృషి చేసిన ఏపీ పోలీసు అధికారులకు ప్రభుత్వం అవార్డులు ఇవ్వనుంది. ఇవాళ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వారికి నగదు అవార్డులను, జ్ఞాపికలను ఇవ్వనున్నట్టు తెలిసింది. సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు ఆధ్వర్యంలో పోలీసు అధికారుల బృందం గంగిరెడ్డిని మారిషస్ నుంచి రాష్ట్రానికి పట్టుకొచ్చింది. ఆ బృందంలో కడప డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్ బీ డీఎస్పీ రాజగోపాల్ రెడ్డిలు ఉన్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ రాముడు వారిని అభినందించారు. ఈ క్రమంలో నిన్న (మంగళవారం) వారు విజయవాడ వచ్చారు. ఈరోజు తనను కలసిన సమయంలోనే పోలీసు అధికారులకు చంద్రబాబు అవార్డులు అందజేయనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News