: బంగ్లాదేశ్ లో కాల్పుల కలకలం... విదేశీ మతగురువుకు తీవ్ర గాయాలు
భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్ లో వరుసగా చోటుచేసుకుంటున్న కాల్పులు కలకలం రేపుతున్నాయి. బంగ్లాదేశ్ లో ఉంటున్న విదేశీయులే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. నేటి ఉదయం బంగ్లా పట్టణం దినాజ్ పూర్ లో సైకిల్ పై వెళుతున్న ఇటలీ మత గురువు పీరోపై గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో పీరో తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులు ఐఎస్ ఉగ్రవాదుల పనేనన్న వాదన వినిపిస్తోందని బంగ్లా పోలీసులు చెబుతున్నారు. బైక్ పై దూసుకువచ్చిన ఓ దుండగుడు పీరోపై కాల్పులు జరిపాడని కొందరు చెబుతుంటే, ముగ్గురు వ్యక్తులు అతి సమీపం నుంచి పీరోపై కాల్పులకు తెగబడ్డారని మరికొందరు చెబుతున్నారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.