: మోదీ కన్నా మ్యాగీయే ఇష్టం: రాంగోపాల్ వర్మ
వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. తనకు ప్రధాని నరేంద్ర మోదీ, మదర్ థెరీసా, స్టీవెన్ స్పీల్ బర్గ్ లకన్నా మ్యాగీ నూడిల్స్ అంటేనే ఇష్టమని గత రాత్రి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టాడు. ఆ వెంటనే చిరంజీవి 151 చిత్రంపైనా వ్యాఖ్యలు చేశాడు. ఆ చిత్రం రీమేక్ అయివుండాలా? లేక బాహుబలికన్నా గొప్పగా ఉండాలా? అంటూ ఓ పోల్ ను ఉంచాడు. ప్రస్తుతం మహాత్మా గాంధీ బతికుంటే, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ఎలా ఎదుర్కొని ఉండేవారని మరో ప్రశ్నా అడిగాడు. ఆయన్ను చూసి ఉగ్రవాదులు హింసా మార్గాన్ని విడనాడతారా? అని మరో పోల్ ఉంచాడు. అరగంట క్రితం... ఈ ఉదయం 10:30కి గాంధీపై ప్రశ్నలను పోస్ట్ చేయగా, వర్మ ఫాలోవర్లలో ఓ 1000 మందికి పైగా స్పందించి తమ సమాధానాలు ఇచ్చారు.