: తెలంగాణ జెన్ కోలో ఉద్యోగాలిప్పిస్తానంటూ టీవీ చానెల్ సీఈవో చీటింగ్... అరెస్ట్


తెలంగాణ జెన్ కోలో ఉద్యోగాలిప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం వేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో హైదరాబాదు తార్నాకకు చెందినా టీ9 న్యూస్ ఛానల్ (టీవీ 9 కాదు) సీఈవో కె.మల్లలన్న అలియాస్ మల్లారెడ్డి కూడా ఉన్నారు. అతను కాకుండా అబిడ్స్ లోని ఓ కళాశాలలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న టి.రమేష్, సీతాఫల్ మండికి చెందిన నిరుద్యోగి బి.నగేష్ బాబు, సచివాలయ ఉద్యోగి డి.వెంకటేశ్వరరావు ఓ ముఠాగా ఏర్పాడ్డారు. జెన్ కోలో ఉద్యోగాలు ఇప్పిస్తామని వేణు, మహేష్ అనే ఇద్దరు వ్యక్తులను నమ్మించారు. ఇందుకోసం ఇద్దరి నుంచి రూ.2 లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నారు. అటు జెన్ కోలో ఏఈ పోస్టుల పేరుతో మరికొందరి నుంచి కూడా రూ.5 లక్షల వసూలు చేశారని తెలిసింది. ఈ వ్యవహారమంతటిపై బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. టాస్క్ ఫోర్స్ తో కలసి చేపట్టిన దాడుల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News