: లేడీ కానిస్టేబుళ్లపై ఈవ్ టీజింగ్... విజయవాడలో ఇద్దరు పోకిరీల అరెస్ట్
ఆకతాయిల నుంచి యువతులు, మహిళలను కాపాడేందుకు బయలుదేరిన ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లకే ఈవ్ టీజింగ్ ఎదురైన ఘటన విజయవాడలో నేటి ఉదయం చోటుచేసుకుంది. నగరంలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న ఇద్దరు మహిళలు నేటి ఉదయం పోలీస్ స్టేషన్ కు వెళుతుండగా, ఇద్దరు ఆకతాయిలు వారిని వెంబడించారు. బైక్ పై వెళుతున్న సదరు కానిస్టేబుళ్లను నానా మాటలు అంటూ ఆకతాయిలు టీజ్ చేశారు. దీంతో లేడి కానిస్టేబుళ్ల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరినీ రంగారెడ్డి, సునీల్ కుమార్ లుగా గుర్తించినట్లు సమాచారం.