: ‘డబుల్ బెడ్ రూం’ సొమ్ము కేంద్రానిది... సోకు కేసీఆర్ ది: రావుల కామెంట్
వరంగల్ పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గరపడేకొద్దీ ఆయా పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్న హైదరాబాదులోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన సందర్భంగా టీ టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు చెప్పుకుంటున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తోందని చెప్పిన ఆయన, ఈ పథకం గొప్పదనమంతా తమదేనని కేసీఆర్ సర్కారు చెప్పుకుంటోందని ఆరోపించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల సొమ్ము కేంద్రానిదైతే, సోకు మాత్రం కేసీఆర్ దిగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. ఇటీవల హైదరాబాదులోని ఐడీహెచ్ కాలనీలో కొత్తగా ప్రారంభించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను చూపిస్తూ కేసీఆర్ వరంగల్ లో ఓట్లు అడుగుతున్నారని రావుల ఆరోపించారు.