: హైదరాబాదును చుట్టేసిన ‘మంచు’ దుప్పటి... ‘ఔటర్’పై రాకపోకలకు తీవ్ర అంతరాయం


బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం నేపథ్యంలో భారీ వర్షాలు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాలతో పాటు తమిళనాడును చుట్టేశాయి. రోజుల తరబడి కురుస్తున్న వర్షం కారణంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పడిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదును మంచు తెరలు కమ్మేశాయి. నేటి ఉదయం నగరాన్ని చుట్టేసిన మంచు దుప్పటి 8 గంటల సమయం దాటినా దాని ప్రభావం తగ్గలేదు. హైదరాబాదు నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై మంచు కారణంగా వాహనాల రాకపోకలపై పెను ప్రభావం పడింది. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. శ్రీశైలం వెళ్లే సాగర్ రోడ్డు పూర్తిగా మంచులో మునిగిపోయింది.

  • Loading...

More Telugu News