: సహారా కేసులో కేసీఆర్ మాజీ పీఎస్ దిలీప్ ను ప్రశ్నించిన సీబీఐ


యూపీఏ హయాంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి హోదాలో టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై సీబీఐ దర్యాప్తు మరింత ముమ్మరమైనట్లు తెలుస్తోంది. స్వీయ పీఎఫ్ ఖాతాల నిర్వహణకు సహారా గ్రూపునకు నాడు కేసీఆర్ జారీ చేసిన అనుమతులపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటికే నేరుగా క్యాంపు కార్యాలయానికి వెళ్లి కేసీఆర్ ను విచారించింది. నాడు కేసీఆర్ కు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన దిలీప్ కుమార్ ను తాజాగా నిన్న ఢిల్లీలో సీబీఐ అధికారులు విచారించారు. సహారా గ్రూపునకు పీఎఫ్ మినహాయింపు వ్యవహారంలో నాడు కేంద్ర మంత్రిగా ఉన్న కేసీఆర్ ఆదేశాల మేరకే తాను వ్యవహరించానని ఈ దర్యాప్తులో దిలీప్ సీబీఐకి చెప్పారు. కేసీఆర్ ఆదేశాల మేరకే తాను వివిధ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ విభాగాలకు లేఖలు రాశానని, ఇందులో తన సొంత నిర్ణయాలేమీ లేవని కూడా దిలీప్ సీబీఐ అధికారులకు చెప్పారు. ఈ మేరకు తనను సీబీఐ అధికారులు విచారించిన మాట వాస్తవమేనని దిలీప్ కుమార్ ఓ తెలుగు దినపత్రికకు చెప్పారు.

  • Loading...

More Telugu News