: ఈ ఇద్దరు అగ్రహీరోల ఫిట్ నెస్ సూపర్: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి
వయస్సు పైబడుతున్నా ఆ ఇద్దరు అగ్రహీరోల ఫిట్ నెస్ సూపర్ అంటోంది బాలీవుడ్ నటి శిల్పాశెట్టి. అందుకే వాళ్లిద్దరూ తనకు స్ఫూర్తి అని చెప్పింది. ఈ వయస్సులోనూ యువ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వాళ్లిద్దరూ నటిస్తున్నారంటూ ఆమె ప్రశంసించింది. ఇంతకీ, ఆ ఇద్దరు అగ్రహీరోలు ఎవరనుకున్నారు? బాలీవుడ్ ప్రముఖ నటులు అమితాబ్, అనిల్ కపూర్! కాగా, శిల్పాశెట్టి రాసిన ‘ది గ్రేట్ ఇండియన్ డైట్’ పుస్తకాన్ని ఈ నెల 19న ఆ హీరోలిద్దరూ ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బీ, అనిల్ కపూర్ లపై ప్రశంసలు కురిపించిందని బాలీవుడ్ వర్గాల సమాచారం.