: ఎవరికి షాక్ ఇవ్వాలో ప్రజలకు బాగా తెలుసు!: కేసీఆర్
‘బీజేపీ నాకు ఎందుకు షాకిస్తుంది? తెలంగాణ ప్రజలకు మంచినీటి పథకం పెట్టినందుకా? కరెంట్ మంచిగా ఇచ్చినందుకా? రూ.200 పింఛన్ ను రూ.1000 చేసినందుకా? దేనికీ కేసీఆర్ కు షాక్ ఇవ్వాలా?’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘కమల’నాథులపై మండిపడ్డారు. ఎవరికి షాక్ ఇవ్వాలో ప్రజలకు బాగా తెలుసని అన్నారు. షాక్ ఇవ్వాలంటున్న బీజేపీకి షాక్ ల మీద షాక్ లు దేశప్రజలు ఇస్తున్నారన్నారు. ఢిల్లీ, బీహార్ లో షాక్ లకు కోల్కోలేక ఇక్కడికి వచ్చి పిచ్చి ప్రేలాపనలు చేయవద్దంటూ బీజేపీ నేతలను కేసీఆర్ హెచ్చరించారు.