: కిషన్ రెడ్డీ! మీ సర్కార్ చేసిన మంచి పనుల్లో ఒక్కటి చెప్పు చాలు!.. నీకు జై కొడతా: కేసీఆర్


‘ఢిల్లీలో వచ్చిన మీ ప్రభుత్వం ఈ 16 నెలల్లో చేసిన ఒక్క మంచి పని ఉందా?’ అంటూ బీజేపీ నేత కిషన్ రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ‘రైతుల గురించా, దళితుల గురించా, గిరిజనుల గురించా, దేశంలోని పేదల గురించా, నిరుద్యోగ యువకుల గురించా... కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని గురించి కిషన్ రెడ్డి చెబితే నేను ఆయనకు జై కొడతాను’ అని కేసీఆర్ అన్నారు. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ దిమ్మ తిరిగి కింద పడింది...ఇటీవల బీహార్ ఎన్నికల్లో బిత్తిరి గత్తరి దెబ్బ తగిలిందంటూ బీజేపీ సర్కార్ పై కేసీఆర్ మండిపడ్డారు. 'పదహారు నెలల్లో రెండు రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీని భయంకరంగా తిరస్కరించారు. అటువంటి బీజేపీ మమ్మల్ని విమర్శిస్తుందా?' అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేసిన టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు షాక్ ఇయ్యాలని ఆ పార్టీ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

  • Loading...

More Telugu News