: రెండో బిడ్డను కనండన్న చైనా నిర్ణయానికి స్పందన కరవు!
ఎన్నో ఏళ్లుగా అవలంబిస్తున్న ఒకే సంతానం విధానానికి చైనా ప్రభుత్వం ఇటీవలే మంగళం పలికింది. అనేక తర్జనభర్జనల మధ్య రెండో బిడ్డను కూడా కనొచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయానికి యువ జంటల నుంచి స్పందన మాత్రం రాలేదు. కేవలం కొంత మంది మాత్రమే సానుకూలంగా స్పందించారు. నానాటికీ పెరుగుతున్న జీవన వ్యయంతో ఇద్దరు బిడ్డలను పెంచి, పోషించడం కత్తిమీద సామే అని చైనా యువతరం భావిస్తుండటమే దీనికి కారణం. ఓ సంస్థ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు తెలిశాయి. సర్వేలో 46 శాతం మంది రెండో బిడ్డ కావాలని కోరుకుంటుండగా, మిగిలిన వారు ఒక బిడ్డే చాలు అని భావిస్తున్నారట.