: భారత్ పై ఐఎస్ఐఎస్ దాడులు జరగవచ్చు: రాజ్ నాథ్ సింగ్
ఇటీవల పారిస్ పై ఐఎస్ఐఎస్ దాడులు జరిగిన నేపథ్యంలో భారత్ పై కూడా ఐఎస్ దాడులు జరగవచ్చని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. దాన్ని అంత తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఆసియా లీడర్స్ సదస్సు ప్రారంభం సందర్భంగా విలేకరులతో రాజ్ నాథ్ మాట్లాడారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం ఏ ఒక్క దేశ సమస్య కాదన్నారు. దాంతో ప్రపంచానికే ముప్పు అని తెలిపారు. ఈ క్రమంలో ఉగ్రభూతాన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు కలసి రావాలని పిలుపునిచ్చారు. పారిస్ దాడుల తరువాత దేశంలో అప్రమత్తత ప్రకటించామన్నారు.