: నల్గొండ బాధితురాలికి ఎట్టకేలకు వైద్యం
అత్యాచార యత్నానికి పాల్పడిన కీచకుల నుంచి తప్పించుకున్న నల్గొండ జిల్లా వివాహిత మహిళకు చివరకు ఉస్మానియా వైద్యులు చికిత్స చేశారు. అంతకుముందు బాధితురాలిని పట్టించు కోవడంలేదని భర్త మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాంతో వైద్యులు ఆమెకు వైద్యం అందించారు. మూడురోజుల కిందట భర్త సుబానీతో కలిసి వెళ్తోన్న ఆమెపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసేందుకు యత్నించారు. ఆ సమయంలో భార్యభర్తలిద్దరూ కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. దీంతో బాధితురాలు తప్పించుకోగలిగింది. ఆ సమయంలో ఆమె తల, మెడ, ఛాతిపై తీవ్రంగా గాయాలయ్యాయి.